News December 1, 2025
యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT
Similar News
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News February 10, 2026
మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.


