News November 5, 2025
యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని అవకాశం: కలెక్టర్

యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణవకాశమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని ఎంపీ సూచించారు.
Similar News
News January 19, 2026
సర్పంచులకు పాఠాలు.. భద్రాద్రి జిల్లాలో శిక్షణకు సర్వం సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఎన్నికైన 468 మంది సర్పంచులకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పాల్వంచ నవభారత్‌లోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. తొలి విడత శిక్షణ నేటి నుంచి 23 వరకు, రెండో విడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు కొనసాగనుంది.
News January 19, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<
News January 19, 2026
ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి: కదిరి సీఐ

నల్లచెరువు (M) చవిటివారిపల్లి గ్రామానికి చెందిన సి.సాయి చరణ్ రెడ్డి (B.Tech) కదిరి టౌన్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి లక్ష్మీపతి, షరీఫ్, చంద్ర పరిచయమై సాఫ్ట్‌వేర్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3,50,000 ఆన్‌లైన్ పేమెంట్ చేయించుకుని మోసం చేసినట్లు వాపోయాడు. భాదితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


