News November 19, 2025

యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

image

యువత పెళ్లి కంటే కెరీర్‌పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

image

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్‌ వెల్లడించింది.

News January 18, 2026

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

image

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.

News January 18, 2026

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

image

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.