News February 21, 2025
యూట్యూబర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

గుంతకల్లు మండలం బుగ్గ సంగాల గ్రామ సమీపంలో 2 రోజుల క్రితం యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని కసాపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ట్రాక్టర్, బైకు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు తెలిపారు. భూ వివాదంతోనే హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 18, 2025
అనంత: మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

అనంతపురం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో చేసుకున్న ఎంవోయులకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో వివిధ కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లోగా రాబోయే మూడు నెలలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను అందజేయాలని ఆదేశించారు.
News March 17, 2025
JNTUA 14వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ విడుదల

అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి 2023-24 మధ్య కాలంలో యూజీ (లేదా) పీజీ (లేదా) పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారు తమ ఒరిజినల్ డిగ్రీలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు https://jntuaebranchpayment.in/originaldegree/ ను సందర్శించాలని సూచించారు.
News March 17, 2025
అనంత: ప్రజల నుంచి కలెక్టర్ అర్జీల స్వీకరణ

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమస్యల అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.