News September 9, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: జాయింట్ కలెక్టర్

image

యూరియా ఎరుకుల కోసం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్‌తో కలిసి ఎరువుల పరిస్థితి పరిశీలించారు. రైతులు మంచి ప్రయోజనాలు కలిగిన నానో యూరియాను వినియోగించాలని కోరారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలు ధాన్యం కొనుగోళ్లపై కూడా మాట్లాడినట్లు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ తెలిపారు.

Similar News

News December 14, 2025

MBNR: ఈనెల 22 నుంచి “టీ-20 క్రికెట్ లీగ్”

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ఈనెల 22 నుంచి 26 వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో జి.వెంకటస్వామి కాక మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్, NGKL, NRPT, GDWL, WNPT జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందన్నారు.

News December 14, 2025

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <>Xలో<<>> దుయ్యబట్టింది. ‘గత రెండేళ్లలో రాష్ట్రంలో 828 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 117 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందిపడ్డారు’ అని రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలు మీ మోసాన్ని గుర్తుంచుకుంటారని పేర్కొంది.

News December 14, 2025

చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

image

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్‌ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.