News December 13, 2025

యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

image

దేశంలో యోగా ప్రచారం, హర్బల్‌ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.

Similar News

News January 19, 2026

గ్రీవెన్స్ సమస్యలు నాణ్యతగా పరిష్కరించాలి: జేసీ

image

పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజల నుంచి 236 అర్జీలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఒక్క అర్జీ పునరావృతం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.

News January 19, 2026

తిరుమల: 19 నుంచి మేల్‌చాట్ వ‌స్త్రాల ఈ-వేలం

image

తిరుమల ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్, ఉల్చాట్, ఉత్తరీయం వస్త్రాలను జ‌న‌వ‌రి 19 నుంచి 22వ‌ తేదీ వరకు ఈ-వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 137 లాట్లు ఉన్నాయి. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని(0877-2264429) లేదా టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.

News January 19, 2026

ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పొరపాట్లు జరగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.