News October 6, 2025
రంగంపేట: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

రంగంపేట మండలం కోటపాడు గ్రామ శివారు ఏడీబీ (ADB) రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. సామర్లకోట నుంచి రాజమండ్రి వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతులను సామర్లకోటకు చెందిన కర్రి గణేశ్, వీరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 16, 2026
అనంత: మరదలిని సుత్తితో కొట్టి చంపిన బావ

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో గురువారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని(17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపురానికి చెందిన పవన్ కుమార్(25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.
News January 16, 2026
₹లక్ష పెట్టుబడికి ₹4 లక్షల రిటర్న్స్!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది. 2019 జులై (సిరీస్-II)లో ₹లక్ష పెట్టిన వారికి నేడు వాటి విలువ ఏకంగా ₹4.15 లక్షలకు చేరింది. RBI ప్రకటించిన తాజా రిడెంప్షన్ ధర ప్రకారం.. గ్రాము బంగారం విలువ ₹14,092గా ఉంది. అంటే ఐదేళ్ల క్రితం ₹3,393కే కొన్న బాండ్లపై ఏకంగా 315% లాభం వచ్చింది. దీనికి అదనంగా ఏటా వచ్చే 2.5% వడ్డీ బోనస్! మీ దగ్గర SGBలున్నాయా? Comment
News January 16, 2026
గార్ల: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని అంకన్నగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెండకట్ల అశోక్(33) అనే రైతు తన సొంత వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో మోటార్ మరమ్మతుల కోసం బావిలో దిగగా ప్రమాదవ శాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. మృతిడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


