News August 11, 2025
రంగారెడ్డి: 3 నెలల్లో ‘ఇందిరమ్మ ఇల్లు’ కట్టిచ్చారు!

పేదల సొంతింటి కల 3 నెలల్లో నెరవేరిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు పథకం సత్ఫలితాలనిస్తోందని MLA శంకర్ అన్నారు. షాద్‌నగర్ పరిధి హాజిపల్లిలో నిర్మాణం పూర్తి అయిన ఇల్లును సోమవారం ఆయన ప్రారంభించారు. భూమి పూజ చేసినప్పటి నుంచి ఏ దశలోనూ నిధులు ఆగలేదని, దీంతో 3 నెలల్లోనే భవనం నిర్మించి, లబ్ధిదారులకు అందజేసినట్లు MLA శంకర్ తెలిపారు.
Similar News
News March 11, 2026
ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..

భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు విటమిన్-డి లోపంతో సతమతమవుతున్నారు. మీకు 30-100 ng/mL మధ్య ఉంటే డి విటమిన్ సరిపడా ఉందని అర్థం. సహజంగా దీనిని పెంచుకునేందుకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తికి ఈ ‘సన్ షైన్’ విటమిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
News March 11, 2026
అడవి వదిలి… ఊరి బాట పట్టిన వానరాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలను వణికిస్తున్నాయి. అడవిని విడిచి ఊర్ల బాట పట్టిన కోతులు, నేరుగా ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద భక్తులు ఇచ్చే ఆహారానికి అలవాటు పడి ఇప్పుడు అడవిలో ఆహారం వెతుక్కోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయాందోళన చెందుతున్నారు.
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.


