News April 25, 2024
రంపచోడవరంలో 88 మంది అరెస్ట్

ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమై రంపచోడవరం డివిజన్ లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి115 కేసుల్లో 88మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై. రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మండలాల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News April 15, 2026
అనపర్తి ‘సెంటిమెంట్’ ఏంటో తెలుసా?

1952లో అనపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో 12 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. అయితే, ఒక వింతైన విషయం ఏమిటంటే, అనపర్తి నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా అవకాశం పొందలేదు. దీనిని స్థానికులు ఒక ‘సెంటిమెంట్’గా భావిస్తారు.

బిక్కవోలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామానికి ఆ పేరు వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. దీనిని పూర్వం ‘బిరుదాంకినవోలు’ అని పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని బిరుదుల ఆధారంగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ద్రవిడ శైలి శివాలయాలు, ఏకశిలా గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి ఉన్నతమైన శిల్పకళా వైభవానికి, వారి మతపరమైన ఆసక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.