News August 11, 2025
రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం నొఖ్వాల్ బాధ్యతలు

రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం నొఖ్యాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023బ్యాచ్‌కు చెందిన ఈయనకు తోలి పోస్టింగ్‌ను రంపచోడవరానికి నియమించారు. కార్యాలయం సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. పలువురు తహసీల్దార్‌లు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News March 15, 2026
ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్ వాపోయారు.
News March 15, 2026
రేపు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో PGRS

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని అన్నారు.
News March 15, 2026
శ్రీరామనవమి నాడు ‘భద్రగిరి గిరిజన మార్ట్’ ప్రారంభం

గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శ్రీరామనవమి నాడు భద్రగిరి మార్ట్ ప్రారంభించనున్నట్లు APO డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ.. మార్ట్ విజయవంతానికి వ్యాపారులు తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూనే, నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు.


