News February 4, 2025

రథ సప్తమి స్పెషల్.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు 

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మంగళవారం మాఘమాసం రథ సప్తమి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. 

Similar News

News February 18, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

image

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రాగా అతడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News February 18, 2025

వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.

error: Content is protected !!