News November 30, 2025
రబీ వరి నారు పోసుకునేందుకు సరైన సమయం

రబీ వరి సాగు చేసే రైతులు డిసెంబర్ 15 లోపు స్వల్పకాలిక రకాలతో నారుమడులు వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎద పద్ధతిలో సాగు చేసినప్పటికీ డిసెంబర్ 31లోపు విత్తుకోవాలి. ఇలా చేస్తే వరి కోత వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ తొలి వారంలో పూర్తి చేయవచ్చు. దీని వల్ల ధాన్యం ముక్క అవ్వదు. అలాగే మార్చిలో కోతకు ముందు అపరాలు లేదా పచ్చిరొట్ట వేసుకోవడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది.
Similar News
News February 15, 2026
చల్లని నీరు Vs వేడి నీరు.. స్నానానికి ఏది బెటర్!

స్నానానికి వేడి నీరు బెటరా? చల్లని నీరు మేలా? అంటే రెండూ మంచివేనంటున్నారు నిపుణులు. చల్లటి నీటితో ఇమ్యూనిటీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. వేడి నీళ్లతో కండరాలు రిలాక్స్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిద్ర ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఉదయం చల్లటి నీళ్లు, రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.
News February 15, 2026
బంగ్లా ప్రయోజనాలకే ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

బంగ్లాదేశ్, ప్రజల ప్రయోజనాలే తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘ఈ గెలుపు బంగ్లాది. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం. హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నా’ అని చెప్పారు. తాజా ఎన్నికల్లో BNP <<19134014>>భారీ మెజారిటీ<<>>తో గెలవడం తెలిసిందే.
News February 15, 2026
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.


