News December 17, 2025
రబీ సీజన్.. అందుబాటులో 2 లక్షల మె.టన్నుల యూరియా

AP: రబీ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రతి జిల్లాలో 21 రోజులకు సరిపడా యూరియాను బఫర్ స్టాకుగా ఉంచుకోవాలని, 2 రోజులకు ఒకసారి యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం అందించాలని, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు.
Similar News
News January 19, 2026
CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.
News January 19, 2026
ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 19, 2026
భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.


