News November 19, 2025
రవికుమార్ కాల్ డేటాపై పరిశీలన..!

తిరుమల పరకామణీ చోరీ కేసులో నిందితుడు రవి కుమార్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అతను ఎవరితో మాట్లాడారు.. ఎవరితో ఛాటింగ్ చేశారు.. చోరీతోపాటు ఇతర అనుబంధ విషయాల గురించి ఆధారాలు సేకరిస్తున్నారు. మరికొందరి డేటా కూడా పరిశీలనచేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 20, 2026
చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.
News January 20, 2026
చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News January 20, 2026
నంద్యాల జిల్లాకు దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో దేశంలోనే అతిపెద్ద సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.


