News November 19, 2025
రవికుమార్ కాల్ డేటాపై పరిశీలన..!

తిరుమల పరకామణీ చోరీ కేసులో నిందితుడు రవి కుమార్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అతను ఎవరితో మాట్లాడారు.. ఎవరితో ఛాటింగ్ చేశారు.. చోరీతోపాటు ఇతర అనుబంధ విషయాల గురించి ఆధారాలు సేకరిస్తున్నారు. మరికొందరి డేటా కూడా పరిశీలనచేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 23, 2026
ADB జిల్లాలో క్షయ నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

క్షయ వ్యాధి నిర్మూలనలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, తప్పుడు సమాచారాన్ని అరికట్టి ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీబీ చికిత్స విజయవంతం కావడానికి ముందస్తు నిర్ధారణ, టీబీ ప్రివెంటివ్ థెరపీ, పోషకాహార మద్దతు అవసరమని తెలిపారు. టీబీ వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సత్కరించారు.
News January 23, 2026
1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కలెక్టర్

రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ-పార్కుల నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. క్షయ, HIV బాధితులకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.
News January 23, 2026
ఆదిలాబాద్: గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డుకు తొడసం కైలాష్ ఎంపిక

గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్- 2025 అవార్డుకు ఆదివాసీ రచయిత తొడసం కైలాస్ ఎంపికయ్యారని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్నారు. రూ.20 వేల నగదుతోపాటుగా ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. తొడసం కైలాష్ మాట్లాడుతూ.. గిరిజన అభివృద్ధి విభాగంలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.


