News March 10, 2025

రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

image

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.

Similar News

News January 20, 2026

నెల్లూరు: పొలంబడి.. తడబడి..!

image

రైతులకు సాగు పాఠాలు నేర్పే పొలం’బడి’ కార్యక్రమం తడబడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో 30 మంది రైతులతో ప్రతీ మంగళ, బుధవారాలు వరుసగా 14 వారాలపాటు కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా ఆచరణలో నీరుగారుతోంది. 24-25 ఏడాదికి జిల్లా వ్యాప్తంగా 31 పొలం బడి శిక్షణ తరగతులు చేపట్టాల్సి ఉన్నా పలుచోట్లా మొదలెట్టలేదు. వీటి నిర్వహణకు ₹10.85 లక్షలు కేటాయించారు. అధికారులు స్పందన లేకపోవడంతో ఆ నిధులు సైతం పక్కదారి పడుతున్నాయట.

News January 20, 2026

నెల్లూరు: పనులు జరగకపోయినా జీతాలు

image

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కొరవడుతోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాలల సంరక్షణకు అమలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు పడకేశాయి. వీటి కోసం గతేడాది ₹3.50 లక్షలు, SNA SPARSHA కింద ₹1.25 లక్షలు ఖర్చు చేయలేదట. మరోవైపు సిబ్బంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారు. ₹42 లక్షల మేరా జీతభత్యాలకు కేటాయించగా ₹27 లక్షలు ఖర్చు చేశారట. కార్యక్రమాలు జరగకపోయినా జీతాలు తీసుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.