News January 27, 2025
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

నాట్యగురువులు మంజుల రామస్వామి, వీఎస్ రామమూర్తి శిష్యురాలు జీఎస్ విద్యానందిని భరతనాట్య ఆరంగేట్రం ఆదివారం రవీంద్రభారతిలో కనుల పండువగా జరిగింది. పుష్పాంజలి, గణపతి స్తుతి, జతిస్వరం, థిల్లాన వంటి పలు అంశాలపై చక్కటి హావభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞశర్మ, ప్రముఖ కవి రాధశ్రీ, సాంస్కృతిక పండితులు సాధన నర్సింహాచారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
సికింద్రాబాద్: షాపింగ్ మాల్‌లో సూసైడ్ అటెంప్ట్!

సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్‌లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News February 9, 2025
ఉప్పల్ MLA ఇంట్లో విషాదం

ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్‌పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
News February 9, 2025
ఉప్పల్‌లో డెలివరీ బాయ్ సూసైడ్!

ఉప్పల్ పీఎస్ పరిధి కురుమానగర్‌లోని ఓ ఇంట్లో వట్టిపల్లి శ్రావణ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి కురుమానగర్‌లో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని శ్రవణ్ కుమార్ సోదరుడు సందీప్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.