News October 7, 2025
రాంగ్ రూట్ డ్రైవ్.. కుటుంబాలకు కన్నీళ్లు: KMR SP

కామారెడ్డి SP రాజేష్ చంద్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై కీలక సందేశం ఇచ్చారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం అని, ఇది మీతో పాటు ఇతరులకూ ప్రాణహాని కలిగిస్తుందని హెచ్చరించారు. హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించడం, స్పీడ్ నియంత్రించడం, మొబైల్ వాడకపోవడం వంటివి తప్పనిసరని సూచించారు. ‘మద్యం మత్తు క్షణికం, దాని ఫలితం మాత్రం శాశ్వతం. ఒక తప్పు డ్రైవ్ అనేక కుటుంబాల కన్నీళ్లకు కారణమవుతుందని’ పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
KNR రీజియన్‌లో 700 బస్సులు ఏర్పాట్లు

మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక<<18889925>> బస్సులు<<>> ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. JAN 27 నుంచి JAN 31వ తేదీ వరకు KNR రీజియన్ పరిధిలో <<18874838>>700<<>> బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అన్నారు. ఆర్టీసీ బస్సులు గద్దె వరకు వెళ్లే సౌలభ్యం ఉన్నందున ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలని కోరారు.
News January 18, 2026
ఇండియాకు mitc‘Hell’ చూపిస్తున్నాడు..

భారత బౌలర్లకు న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ చుక్కలు చూపిస్తున్నారు. గత మ్యాచులో సెంచరీతో చెలరేగిన ఈ ప్లేయర్ మూడో వన్డేలోనూ అర్ధశతకం బాదారు. 56 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్‌లో అతడికి ఇది మూడో 50+ స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా వన్డేల్లో భారత్‌పై 11 ఇన్నింగ్సుల్లో 600+ రన్స్ చేయగా ఆరు సార్లు 50+కి పైగా పరుగులు చేశారు. అద్భుతమైన ఫామ్‌తో ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నారు.
News January 18, 2026
పోచంపల్లి ఇక్కత్‌కు జర్మనీ దేశస్థులు ఫిదా!

అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీని చూసి జర్మనీ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు. ఆదివారం వారు భూదాన్ పోచంపల్లిని సందర్శించి, టూరిజం పార్కులోని మగ్గాలను పరిశీలించారు. నూలుదారానికి రంగులు అద్దడం, చిటికిలుచుట్టడం, మగ్గంపై చీర నేసే ప్రక్రియను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక దుకాణాల్లో ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వారు అభినందించారు.


