News March 15, 2025
రాంబిల్లి: అలలకు వ్యక్తి గల్లంతు

రాంబిల్లి మండలం కడపాలెంకి చెందిన మత్స్యకారుడు మెరుగు జగన్(20) చేపలు పడుతుండగా సముద్రపు అలలకు బోటు తిరగబడి గల్లంతయ్యాడు. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం జెడ్.చింతవ సమీపంలో ఐదుగురితో కలిసి చేపలు పడుతుండగా బోటు తిరగబడి జగన్ గల్లంతయ్యాడు. మిగిలిన ఐదుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతయినట్లు అతని తండ్రి అచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.
News February 15, 2026
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.
News February 15, 2026
KRI: DJ శబ్దాలు.. కట్టడి కరవు?

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో భారీ స్థాయిలో ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రభల వద్ద కొందరు నిర్వాహకులు DJల ఏర్పాటుతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవి అశ్లీల పాటలతో హోరెత్తించనున్నాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో DJ శబ్దాల వల్ల అనేకమంది గుండెపోటుకు గురయ్యారని పేర్కొన్నారు. అధికారులు ఆ బాక్సుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


