News March 27, 2024
రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు: మాధవి రెడ్డి

త్వరలో రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవీ రెడ్డి ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులో ‘అవినీతి చేయడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తప్ప జనాలకు ఏమైనా చేశారా… మీ రాక్షస పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 13, 2026
పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి: విలియం కటింగ్

జమ్మలమడుగు పట్టణంలోని సీఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్‌ను పూర్వ వైద్యుడు డాక్టర్ విలియం కటింగ్ సందర్శించారు. శుక్రవారం ఆయన హాస్పిటల్లోని ప్రతి వార్డులో తిరిగి తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.1961-1973 నాటికి, ఇప్పటికీ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం 6.30కు ఫొటో ఆల్బమ్ విడుదల చేస్తామని హాస్పిటల్స్ సూపరిటెండెంట్ డాక్టర్ అగస్టిన్ రాజ్ తెలిపారు.
News February 12, 2026
YVU దూరవిద్య సమాచారం కోసం ప్రత్యేక డొమైన్

YVU దూరవిద్య సంబంధిత సమగ్ర సమాచారం అందుబాటులోకి తెస్తూ వైవీయూ వెబ్సైట్లో ప్రత్యేక డొమైన్‌ను VC ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. అనుబంధ దూరవిద్యా కేంద్రాలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కోర్సులు, అడ్మిషన్లు, ఫీజులు, పరీక్షల షెడ్యూల్ ఇలా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ పి.పద్మ, ప్రొ.కె.కృష్ణారెడ్డి, ప్రొ.తుమ్మలకుంట శివ, డా.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
News February 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.


