News April 18, 2024

రాజంపేటకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు

image

రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.

Similar News

News September 16, 2024

పోరుమామిళ్ల మండలంలో వ్యక్తి సూసైడ్

image

పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈదుళ్ళపళ్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి, ఇది హత్యా ఆత్మహత్యా అన్న కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2024

కడప: 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజాప్రయోజన పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు. మిలాన్ ఉన్ నబీ పండగ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పేర్కొన్నారు.

News September 16, 2024

కడప: ‘ఇసుక పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయాలి’

image

ఇసుక పంపిణీ నియమ నిబంధనలో మేరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్‌వో గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.