News February 18, 2025

రాజంపేట్: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన కోదండం సాయికుమార్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. మృతుడు రెండు రోజుల క్రితం పురుగు మందు తాగడంతో కామారెడ్డిలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. అతను తూప్రాన్‌లో ఐటీఐ చదువుతున్నట్లు చెప్పారు.

Similar News

News March 15, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News March 15, 2026

మంచిర్యాల: అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు

image

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సమన్వయంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, తాగునీరు, కనీస మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.

News March 15, 2026

టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు: SP

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 165 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP సుబ్బారాయుడు తెలిపారు. కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేస్తూ మాస్ కాపీయింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.