News May 23, 2024

రాజంపేట: అల్లరిమూకల అణచివేతకు ప్రత్యేక బృందాలు

image

అసలే ఎన్నికల వాతావరణం.. ఓట్ల లెక్కింపు అనంతరం అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు కార్డెన్ సెర్చ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులందరూ రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతిభద్రతలకు అఘాతం కలగకుండా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

Similar News

News March 13, 2026

పొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

పొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,780
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,518
*వెండి 10 గ్రాముల ధర రూ.2,665

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

News March 13, 2026

కడప: వంట గ్యాస్ బ్లాక్‌లో అమ్మితే చర్యలే

image

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.