News August 13, 2025
రాజంపేట: బొప్పాయి ధరలపై ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ నంబర్లు

రాజంపేట డివిజన్‌లోని బొప్పాయి రైతుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బొప్పాయి ధర రూ.9 కంటే తక్కువగా ఉంటే, రైతులు ఈ హెల్ప్‌లైన్‌లకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 9573990331, 9030315951.
Similar News
News March 7, 2026
రాజకీయాల్లోకి త్రిష?

TVK చీఫ్ విజయ్-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.
News March 7, 2026
ఖమ్మం: మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

ఖమ్మంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిరుపేద మహిళలకు ‘రిటైల్ అండ్ సేల్స్ అసిస్టెంట్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ విజేత తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 18-35 ఏళ్ల లోపు వయస్సు, పదో తరగతి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 7, 2026
HYD ఆక్రమణలు, చెత్తతో నిండింది: సీఎం

HYD ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని గొప్ప సుందరమైన నగరంగా HYDను మంచిగా చేస్తానంటే BRS ఒప్పుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము చేయలేదు నువ్వు చేయొద్దని KTR అంటున్నారని వ్యఖ్యానించారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపామన్నారు. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అది పెద్ద ఆస్తిగా మారింది. ఎవ్వరూ మూసీలో బతకాలి అనుకోరన్నారు.


