News February 17, 2025
రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

రాజంపేట మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావుపై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాజంపేట మున్సిపాలిటీ ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని, ఆదాయ మెరుగుదల, బహిరంగ తనిఖీలు నిర్వహించడంలో విఫలమైన కారణంగా రాజంపేట మున్సిపాలిటీ సర్వీస్ నుండి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 20, 2026
KMR: నేటి నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి 27 వరకు 14 పరీక్షా కేంద్రాల్లో ఓపెన్ పది, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గం. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షలు జరిగే సమయంలో హాల్ టికెట్లతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డులు తమ వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలని తెలిపారు.
News April 20, 2026
అమానుషం.. కన్నపిల్లల్నే కాల్చి చంపాడు!

అమెరికాలోని లూసియానా కాల్పుల <<19693285>>కేసులో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కాల్చి చంపిన ఎనిమిది మంది పిల్లల్లో ఏడుగురు కన్నబిడ్డలే ఉన్నారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. భార్య, మరో మహిళపైనా నిందితుడు కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. 2024 జనవరి తర్వాత USలో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2026
NGKL: రైతుల ఖాతాల్లోకి నేడు ‘రైతు భరోసా’ నిధులు

NGKL జిల్లాలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని సుమారు 2.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేడు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూ.103 కోట్లను విడుదల చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు ఈ నిధులను విడుదల చేయనున్నారు.


