News May 3, 2024

రాజంపేట యువతతో రేపు నారా లోకేశ్ ముఖాముఖి

image

18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు గల రాజంపేట యువతీ, యువకులతో శనివారం నారా లోకేశ్ స్వయంగా మాట్లాడుతారని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. రాజంపేట మండలం కూచివారిపల్లి పంచాయతీ విద్యానగర్‌లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు లోకేశ్ ముఖాముఖి ఉంటుందని తెలిపారు. యువతీ యువకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Similar News

News November 14, 2024

నందలూరు: వర్రా, సజ్జల భార్గవ్‌పై మరో కేసు

image

నందలూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ. ఐటీ చట్టాల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వీరిపై 20 కేసులు నమోదయ్యాయి.

News November 14, 2024

కడప: వర్షంలోనూ సజావుగా ఆర్మీ ర్యాలీ

image

కడపలో ఆర్మీ రిక్యూట్‌మెంట్ ర్యాలీ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగవరోజు ర్యాలీ జరుగుతున్న DSA మైదానం బురదగా మారింది. దీంతో రిమ్స్ హాస్పిటల్ రోడ్డులో రన్నింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

News November 14, 2024

ప్యానల్ స్పీకర్ల జాబితాలో కడప జిల్లా MLAలు

image

వివిధ పార్టీలకు చెందిన MLAలను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈక్రమంలో కడప జిల్లా బద్వేల్ వైసీపీ MLA దాసరి సుధాకు ఆ జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. దాసరి సుధ స్పీకర్ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. వైసీపీలో గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని సైతం ప్యానల్ స్పీకర్‌గా ఎంపిక చేశారు.