News October 8, 2025

రాజకీయ వివాదాలకు కేంద్రంగా చిత్తూరు జిల్లా

image

వరుస వివాదాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాను చుట్టుముడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల రాజకీయ ఎత్తుగడలకు జిల్లా వేదికగా మారింది. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. YCP నేతలు లేవనెత్తిన అంశాలకు TDP నేతలు మూకుమ్మడిగా కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకు వేసి బూతులతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మీ కామెంట్ ఏంటి..?

Similar News

News January 18, 2026

VZM: యాక్సిడెంట్.. తండ్రి కళ్లెదుటే చిన్నారి మృతి

image

విజయనగరం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిరణ్ కుమార్ తన కుమారుడు, బావ లోకేశ్‌తో కలిసి శ్రీకాకుళం (D) నుంచి విశాఖకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూసపాటి రేగ (M) పేరాపురం నేషనల్ హైవే వద్ద వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిరా ఖనీష్ (6) అక్కడికక్కడే మృతి చెందాడు. తన కళ్లెదుటే కన్నబిడ్డ చనిపోవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. లోకేశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు.

News January 18, 2026

ఏలూరు: AI, ఫిల్మిం మేకింగ్, వెబ్ డిజైన్ కోర్సులు ఫ్రీ.!

image

చదువుతోపాటు స్కిల్స్‌తోనే భారీ జీతం సాధ్యం. కేంద్రం <>SWAYAM<<>>, మూక్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఉచితంగా AI, యానిమేషన్, ఫిల్మిం మేకింగ్, ఏరోప్లేన్ తయారీ, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, వెబ్ డిజైన్ వంటి దాదాపు 18 వందల కోర్సులను ఉచితంగా అందిస్తోంది. IIT ప్రొఫెసర్లు బోదిస్తారు. స్టూడెంట్స్‌తోపాటు, చదువు ఆపేసిన వారు, కొత్తగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వారు చేరొచ్చు. డిగ్రీతో సమానమైన సర్టిఫికెట్ అందిస్తారు.

News January 18, 2026

MDK: తప్పిపోయిన 27 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు

image

జాతరలో తప్పిపోయిన బాలుడు 27 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం పెద్దతండాలో వెలుగుచూసింది. దేవులీబాయి-రూప్‌సింగ్ కుమారుడు రవీందర్‌నాయక్ 3ఏళ్ల వయసులో అల్లాదుర్గ్ జాతరలో తప్పిపోయాడు. తప్పిపోయిన అతడిని పిల్లలు లేని మరో జంట అక్కున చేర్చుకుని ఇతర రాష్ట్రంలో పెంచింది. తాజాగా అసలు విషయం తెలియడంతో స్వగ్రామానికి చేరుకున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.