News December 1, 2025
రాజధాని జిల్లాగా మారుతున్న పల్నాడు.!

అమరావతి విస్తరణతో పల్నాడు జిల్లా రాజధాని జిల్లాగా మారనుంది. రెండో విడతలో అమరావతి మండలంలోని పెద్దమద్దూరు, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల నుంచి భూసమీకరణ చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద రైల్వే స్టేషన్, బుల్లెట్ ట్రైన్, గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే జిల్లా మీదుగా వెళ్లనున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధిలో కీలక మలుపు తిరగనుంది.
Similar News
News February 19, 2026
రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన మోదీ!

ముస్లిం సోదరులకు PM మోదీ, తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రంజాన్ ముబారక్! ఈ పవిత్ర మాసం మన సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని మరింత పెంచాలి. ప్రతిచోట శాంతి, శ్రేయస్సు నెలకొనాలి’ అని PM ట్వీట్ చేశారు. ముస్లింల దీక్షలు పవిత్రంగా సాగాలని CBN ఆకాంక్షించారు. ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంచుతాయని రేవంత్ తెలిపారు.

‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.