News March 13, 2025

రాజనీతి శాస్త్రంలో నిర్మల్ వాసికి డాక్టరేట్

image

నిర్మల్‌ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్‌ కొండా గోవర్ధన్‌ ఇటీవల హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో పొలిటికల్‌ అవేర్నెస్‌ ఆఫ్‌ గ్రాస్‌ రూట్‌ లెవెల్‌ లీడర్‌‌షిప్‌ ఇన్‌ ఆదిలాబాద్‌ డిస్ట్రిక్ట్‌ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనను పలువురు మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి, సాగర్‌రెడ్డి, మహేశ్, అశోక్ ఉన్నారు.

Similar News

News February 16, 2026

BIG BREAKING: కొత్తగూడెం మేయర్‌గా గణేష్ ఎన్నిక

image

కొత్తగూడెం మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్‌గా సుజాతనగర్ 21 డివిజన్ కార్పొరేటర్ మూడు గణేష్‌ను సీపీఐ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారికంగా సీపీఐ నేతలు మూడు గణేష్ ఎంపికపై వివరాలు వెల్లడించారు. కాగా ఉపమేయర్ పదవిని కాంగ్రెస్‌కు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.

News February 16, 2026

అనకాపల్లి: నిరంతరాయంగా 10th ప్రీ ఫైనల్ పరీక్షలు

image

పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయని DEO అప్పారావు నాయుడు తెలిపారు. ఈ నెల 9న తెలుగుతో మొదలైన ఈ పరీక్షలు సోషల్ స్టడీస్‌తో 17న ముగుస్తాతాయని సోమవారం తెలిపారు. శివరాత్రి జాగరాలు నేపథ్యంలో సోమవారం దాదాపుగా అన్ని పాఠశాలలూ లోకల్ హాలిడేని ప్రకటించాయి. అయినప్పటికీ సోమవారం షెడ్యూల్ ప్రకారం బయాలజీ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు.

News February 16, 2026

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.