News November 19, 2025
రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.
Similar News
News January 21, 2026
లైఫ్ ఇన్సూరెన్స్: ప్రీమియం చెల్లింపులో జాప్యం చేస్తే..?

టర్మ్ ఇన్సూరెన్స్ నెలవారీ ప్రీమియానికి 15రోజులు, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేందుకు 30రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అవుతుందని గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ MD సబ్యసాచి తెలిపారు. ‘దీంతో క్లయింట్లు కవరేజీ కోల్పోతారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరిస్తాయి. అందుకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి’ అని వివరించారు.
News January 21, 2026
సంగారెడ్డి: ‘భూభారతి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి’

సంగారెడ్డి జిల్లాలో భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
News January 21, 2026
అన్నమయ్య: మైనర్‌పై 75ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం.. చివరికి.!

అన్నమయ్య జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 75 ఏళ్ల వృద్ధుడికి కడప పోక్సో కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధించింది. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన ఈ కేసులో నేరం రుజువైంది. సమర్థవంతమైన దర్యాప్తుతో శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను జిల్లా SP ధీరజ్ అభినందించారు. మహిళలు, పిల్లల రక్షణలో రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు.


