News November 19, 2025

రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.

Similar News

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

News January 19, 2026

స్పెయిన్ రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య

image

దక్షిణ స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో హైస్పీడ్ రైలు అడముజ్ సమీపంలో పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రైళ్ల బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదేళ్ల కాలంలో స్పెయిన్‌లో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే.

News January 19, 2026

విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

image

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.