News November 7, 2025

రాజన్న ఆలయం పడమరవైపు గేటు మూసివేత

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం పడమరవైపు గేటును మూసివేశారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో రాజన్న ఆలయంలో సాధారణ దర్శనాలు కొనసాగిస్తున్న అధికారులు అన్నిరకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయానికి మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పడమరవైపు స్వాగత ద్వారానికి అడ్డంగా రేకులను అమర్చారు. పీఆర్‌ఓ కార్యాలయ మార్గం నుంచి ఆలయంలోపలికి వెళ్లకుండా అక్కడ కూడా రేకులను అడ్డుగాపెట్టి రాకపోకలను నిలిపివేశారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

image

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.

News January 14, 2026

మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

image

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.

News January 14, 2026

చందుర్తి: GREAT.. జాతీయ స్థాయికి ఎంపిక: కలెక్టర్ ప్రశంస

image

సైన్స్ ప్రాజెక్ట్‌ను రూపొందించి జాతీయ స్థాయికి ఎంపికైన మల్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జాహ్నవిని కలెక్టర్ గరీమా అగర్వాల్ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కలెక్టర్ అభినందించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.