News October 5, 2025

రాజన్న సిరిసిల్లలో రేపు మంత్రి సీతక్క పర్యటన

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీతక్క ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News January 24, 2026

షోరూంలోనే రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి

image

TG: వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. నిన్న మాదాపూర్‌లో చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇకపై బండి కొన్న షోరూమ్‌లోనే ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి అక్కడికక్కడే నంబర్ పొందొచ్చు. RC నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేస్తుంది.

News January 24, 2026

యాదగిరిగుట్టలో రౌడీషీటర్ హత్య..UPDATE

image

యాదగిరిగుట్ట మైలార్‌గూడెం శివారులో ఓ కాటేజీలో శుక్రవారం <<18940229>>రౌడీషీటర్ <<>>నిశాంత్ ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన నిశాంత్ తన స్నేహితుడితో కలిసి కాటేజీకి వెళ్లగా, అక్కడ మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు నిశాంత్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. మృతుడిపై గతంలో 11కేసులున్నాయని, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రవర్తన మార్చుకోలేదని సీఐ భాస్కర్ తెలిపారు.

News January 24, 2026

ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియాకు చెక్

image

ఇప్పటి వరకు విచ్చలవిడిగా సాగిన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక-మన వాహనం’ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 24గంటల్లో డోర్ డెలివరీ చేస్తారు. క్వారీ నుంచి ఇంటి దూరాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారంరోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.