News November 7, 2025
రాజన్న సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో ‘వందేమాతరం’

వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయం గ్రౌండ్‌లో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ గితే వందేమాతరం ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News January 24, 2026
కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
News January 24, 2026
WGL: ‘రూ.కోటి ఇస్తా ఛైర్మన్ చేయండి..!’

WGL జిల్లాలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆశావహుల హడావిడి మామూలుగా ఉండటం లేదు. తాజాగా వర్ధన్నపేట ఛైర్మన్ పదవి ఇస్తే రూ.కోటి ఇస్తానంటూ ఏకంగా డబ్బుల సంచితో సమావేశానికి రావటంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎదుట డబ్బులు చూపించి పదవి కావాలని అడిగాడట. గతంలో ఒక్క ఓటుతో తన భార్యను గెలిపించుకున్న వ్యక్తి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక్కడ ఛైర్మన్ (R)జనరల్.
News January 24, 2026
సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 72 వార్డుల కోసం 176 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 49 మంది ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 13 మంది నోడల్ అధికారుల పర్యవేక్షణలో త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు.


