News November 7, 2025
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో ‘వందేమాతరం’

వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అధికారులు కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం ప్రజలలో దేశభక్తి, ఐక్యత, సమానత్వాన్ని నింపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించినట్లు జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. సకాలంలో ఫీజు చెల్లించని వారు ఈనెల 25 వరకు ఒక్కో పేపరుకు రూ.50 అపరాధ రుసుముతో సంబంధిత కేంద్రాల్లో చెల్లించవచ్చు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 17, 2026
కేజీహెచ్‌లో రోగులతో మాట్లాడిన కలెక్టర్

కేజీహెచ్‌లోని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వార్డులో పర్యటించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడగా రోగి సిబ్బందికి డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పడంతో విచారణకు ఆదేశించారు. అక్కడే ఉన్న సూపర్డెంట్ ఈ విషయంపై విచారణ చేయాలని వైద్యం కోసం ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఉచితంగా వైద్య సేవలు అనే బోర్డులు పెట్టాలని సూచించారు
News January 17, 2026
పెద్దపల్లి జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

పెద్దపల్లి జిల్లాలోని పురపాలికలు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ ముగిసింది. రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్సీ (జనరల్)కు కేటాయించగా, పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్మన్ స్థానాలు బీసీ(జనరల్)కు దక్కాయి. సుల్తానాబాద్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించారు. మరికాసేపట్లో వార్డులవారీగా పూర్తిస్థాయి జాబితా వెలువడనుంది.


