News October 5, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వర్షపాత నమోదు వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల 64.5 మిమీ, కోనరావుపేట 60.3, వేములవాడ 39.0, గంభీరావుపేట 34.0, ముస్తాబాద్ 26.3, ఇల్లంతకుంట 24.5, ఎల్లారెడ్డిపేట 21.3,వేములవాడ రూరల్ 16.3, తంగళ్ళపల్లి 11.0, వీర్నపల్లి 10.5, బోయిన్పల్లి 5.8, రుద్రంగి 2.0, చందుర్తి 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News January 22, 2026
భద్రాద్రి: విద్యార్థుల చదువుల స్థాయిపై కలెక్టర్ అసంతృప్తి

ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం సందర్శించారు. విద్యార్థుల చదువు స్థాయిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారికి అవసరమైన మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనవసర ఖర్చులు చేయకుండా విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఎంపీపీఎస్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి వారంలోగా పూర్తి చేయాలన్నారు.
News January 22, 2026
శ్రీకాళహస్తిలో VIPలకు టైంస్లాట్ దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం వచ్చే వీఐపీలకు టైం స్లాట్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. ప్రోటోకాల్‌కు అనుగుణంగా తిరుమల తరహాలోనే శ్రీకాళహస్తిలో నిర్దేశిత సమయాన్ని వీఐపీల దర్శనానికి కేటాయిస్తామని చెప్పారు. వీఐపీలు తమకు కేటాయించిన సమయంలోనే దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 22, 2026
భారత్‌లో T20 WC ఆడేదే లేదు: బంగ్లాదేశ్

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. తమకు WC ఆడాలని ఉందని, అయితే ఇండియాలో కాదని తెలిపింది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ఒప్పుకోని విషయం తెలిసిందే. భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ BCB తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది.


