News October 7, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం ఇలా

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలను ప్రణాళికాధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలో సగటున 9.6 మి.మీల వర్షపాతం నమోదైందన్నారు. రుద్రంగి మండలంలో అత్యధికంగా 18.2 మి.మీ, వీర్నపల్లిలో 15.1 మి.మీ, ఎల్లారెడ్డిపేటలో 21.7 మి.మీ వర్షం కురిసిందని పేర్కొన్నారు. జిల్లాలో 8 మండలాలు సాధారణ స్థితిలో, 5 మండలాలు అధిక వర్షపాతం కింద ఉన్నాయని చెప్పారు.

Similar News

News January 17, 2026

ఖమ్మం, భద్రాద్రిలో మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఇవే.!

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఛైర్మన్ల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ – ఎస్టీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ – జనరల్ మహిళ, అశ్వారావుపేట మున్సిపాలిటీ – జనరల్ మహిళ, ఇల్లందు – బీసీ మహిళ, కల్లూరు – ఎస్టీ జనరల్, మధిర – జనరల్ మహిళ, వైరా – జనరల్ మహిళ, సత్తుపల్లి – జనరల్ మహిళ, ఏదులాపురం – ఎస్సీ మహిళకు కేటాయించారు.

News January 17, 2026

కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

image

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.

News January 17, 2026

NZB: వరుసగా మూడోసారి మేయర్ పదవి మహిళ (జనరల్)కే

image

త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు పర్యాయాలు మహిళ (జనరల్)కు రిజర్వ్ అవగా BRS నుంచి ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని చేపట్టారు. ఈ పర్యాయం BJP, కాంగ్రెస్, BRS, MIM పార్టీలు మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.