News March 5, 2025
రాజన్న సిరిసిల్ల: నేడే పరీక్షలు.. ALL THE BEST

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 9,310 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 5,065, సెకండియర్‌లో 4,245 మంది విద్యార్థులు రాయనుండగా.. 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST
Similar News
News December 17, 2025
అల్లూరి: అంతర్జాతీయ వేదికపై మెరిసిన రవనికి అభినందనలు

డిసెంబరు 13న దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్ అథ్లెటిక్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో రవని అద్భుత ప్రతిభ కనబరిచింది. 400 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించడం అల్లూరి జిల్లాకు గర్వకారణం. రవని విజయం యువతకు ప్రేరణగా నిలుస్తోందని హుకుంపేట సామాజిక సేవకులు, గ్రామస్థులు అభినందించారు.
News December 17, 2025
పిట్లం: మంజీరాలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

ఓ వ్యక్తి మంజీరాలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలం బొల్లక్‌పల్లిలో జరిగింది. SI వెంకట్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం గోవూరుకు చెందిన కమ్మరి శ్యాం కుమార్(59) గత కొంతకాలంగా కంటినొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 12న ఆసుపత్రికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వచ్చిన శ్యాం కుమార్ బొల్లక్‌పల్లి శివారులోని మంజీరాలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 17, 2025
స్పీకర్ నిర్ణయంతో BRSకు షాక్

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న <<18592868>>MLA<<>>లపై అనర్హత వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయని BRS ఆశించింది. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడుతోంది. కానీ తాజాగా స్పీకర్.. ఐదుగురు MLAలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయంతోనే ఏకీభవించనుంది. దీంతో ఉపఎన్నికల్లో గెలుస్తామని భావించిన కారు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా ఇప్పటికే 2 ఉపఎన్నికల్లో BRS ఓటమిపాలైన విషయం తెలిసిందే.


