News December 10, 2024

రాజమండ్రి: ‘టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది’

image

టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందని, బీసీ కులాల గొంతు నొక్కిన చంద్రబాబు చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీట్ల కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు. ఈనెల 13న రైతులకు అండగా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

Similar News

News January 22, 2025

అల్లవరం: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ అల్లవరం మండలం గోడిబాడవకు చెందిన సిర్రా సందీప్(5) మంగళవారం మృతి చెందాడు. ఎస్సై హరీశ్ కుమార్ కథనం.. అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్‌ను పేరెంట్స్ దుర్గాప్రసాద్, శిరీష బైక్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గోడిలంక శ్మశాన వాటిక సమీపంలో కుక్క అడ్డురావడంతో కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News January 22, 2025

రాజమండ్రి: ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడు అదృశ్యం

image

ఉద్యోగం చూసుకుంటానని విశాఖపట్నం వెళ్లిన తన కుమారుడు ఇప్పటివరకు తిరిగిరాలేదని హుకుంపేట గ్రామానికి చెందిన రేలంగి శ్రీనివాసరావు మంగళవారం బొమ్మూరు పోలీసులకు పిర్యాదు చేశారు. తన 22ఏళ్ల రేలంగి దేదీప్‌ బిటెక్‌ పూర్తిచేశాడు. గత నెల 20వతేదీన ఉద్యోగం చూసుకుంటానని విశాఖపట్నం వెళ్లాడు. అయితే కొద్దిరోజులుగా అతనిఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

News January 22, 2025

రాజమహేంద్రవరం: పెళ్లి పేరుతో మోసం.. అధ్యాపకుడిపై కేసు 

image

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన అధ్యాపకుడు సురేశ్ కుమార్‌పై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రాము మంగళవారం తెలిపారు. రాజమహేంద్రవరం కొంతమూరుకు చెందిన యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామన్నారు. పెళ్లి పేరు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తనకు ఇంతకుముందే పెళ్లయిందని సమాధానం చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.