News December 12, 2025

రాజమండ్రి: టెట్ పరీక్షకు 1,805 మంది హాజరు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండవ రోజు ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు తెలిపారు. స్థానిక లూధర్ గిరిలో గల రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికిగాను 907 మంది హాజరయ్యారని, 48 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం షిఫ్ట్‌లో 955 మందికి 898 మంది హాజరవగా.. 57 మంది గైర్హాజరైనట్టు డీఈవో తెలిపారు

Similar News

News January 23, 2026

తూ.గో: ఉద్యోగాలకు 57 మంది ఎంపిక

image

కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూ.గో జిల్లాకు చెందిన 57మంది ఎంపికయ్యారని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 23, 2026

తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

News January 23, 2026

ప్రాథమిక రంగ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం: ఇన్ఛార్జి కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగంలో పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖలు పోస్ట్‌ హార్వెస్టింగ్ యూనిట్లను.. పశుసంవర్ధక శాఖ డైరీ, పాల ఉత్పత్తులకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లను ప్రోత్సహించాలన్నారు.