News April 23, 2025

రాజమండ్రి: వ్యభిచారం నిర్వహిస్తున్న అన్నా చెల్లెలు

image

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. సీఐ మురళీకృష్ణ వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వచ్చి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.

Similar News

News March 11, 2026

విశాఖ: 969 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన!

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విశాఖలోని భీమిలి, పెందుర్తి మండలాల్లో 79 పంచాయతీలు ఉండగా.. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో 646 పంచాయతీలు కలవు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ముందుగా పరిషత్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ ఎన్నికలు చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో అప్పటివరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది.

News March 11, 2026

ఉక్రెయిన్ ఆఫర్‌కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

image

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్‌ను ఆశ్రయిస్తోంది.

News March 11, 2026

విశాఖ: ఎన్నికలపై సందిగ్ధత

image

విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.