News November 8, 2025
రాజయ్యపేటలో మళ్లీ పోలీస్ బలగాల మోహరింపు

నక్కపల్లి (M) రాజయ్యపేటలో శుక్రవారం రాత్రి నుంచి పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. ఈ గ్రామంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు తనను సచివాలయంలో నిర్బంధించారని, దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ గ్రామ సెక్రెటరీ కాకర సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇద్దరినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
Similar News
News January 14, 2026
ట్రాఫిక్ జామ్ ఇక గతం: భాగ్యనగరంలో త్వరలో నయా ‘హైవే’ మ్యాజిక్!

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూసున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గొల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదాచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
News January 14, 2026
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు!

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్‌కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News January 14, 2026
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు ఇవే..

1)సెమీకండక్టర్స్ టెక్నాలజీ,
2)సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
3)ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్
4)ల్యాండ్ స్కేప్ డిజైన్, 5)బయోటెక్నాలజీ
6)కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
7)సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
8)ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
9)అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ


