News May 13, 2024

రాజవొమ్మంగిలో మోరాయించిన ఈవీఎంలు

image

ఏజెన్సీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజవొమ్మంగి మండలంలోని 75, 76 పోలింగ్ కేంద్రాలలో ఇప్పటివరకు ఈవీఎంలు మోరాయించడంతో ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం ఈవీఎంలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని పోలింగ్ ఆఫీసర్లు వెల్లడించారు.

Similar News

News December 9, 2025

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: డీఈఓ

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించినట్లు తూ.గో డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు తాజాగా అవకాశం కల్పించారు. రూ. 50 రుసుముతో 12వ తేదీ వరకు, రూ. 200 ఫైన్‌తో 15వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 9, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి: కలెక్టర్ కీర్తి

image

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్‌కెవిటి కళాశాలలో మంగళవారం సీడబ్ల్యూఎస్‌ఎన్ (CWSN) జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఆటల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బహుమతులు అందజేశారు.

News December 9, 2025

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.