News April 19, 2024

రాజాంలో ప్రచారరథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు

image

రాజాం పట్టణంలో వైసీపీ ప్రచారరథం ఢీకొని భరద్వాజ్(10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం నడిపి.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Similar News

News September 13, 2024

ఇచ్చాపురం: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి

image

సిక్కోలు జిల్లాలో కిడ్నీ రోగానికి మరొకరు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఆశి వీధికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

News September 13, 2024

శ్రీకాకుళం మెప్మా పీడీగా ఎస్వీ రమణ

image

శ్రీకాకుళం మెప్మా పీడీగా విధులు నిర్వహిస్తున్న ఎం.కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెప్మా కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్వీ రమణ పీడీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ కుమార్‌కు స్థానిక కార్యాలయ సిబ్బంది వీడ్కోలు పలికారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రమణకు అభినందనలు తెలిపారు.

News September 13, 2024

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం: ధర్మాన

image

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఇచ్చాపురంలో స్థానిక నాయకులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.