News February 15, 2025
రాజాపేట: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

పొట్టకూటి కోసం తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి గీతకార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజాపేట మండలంలో శనివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల.. నెమిలి గ్రామానికి చెందిన పాల సిద్ధులు గౌడ్ నేటి ఉదయం రోజువారీగా కల్లుగీత కోసం తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News March 24, 2025
వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.
News March 24, 2025
సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News March 24, 2025
కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్‌నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.