News December 1, 2025
రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం

తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు మండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు తెలిపారు. ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సోమవారం విచారణ జరిపారు. 6 నెలల్లో తన పదవి కాలం పూర్తవుతుందని, ఇప్పుడు రాజీనామా చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని ఛైర్మన్ సూచించడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. YCP తరఫున MLC గా ఎన్నికైన ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Similar News
News February 17, 2026
$100 బిలియన్లతో అదానీ ఏఐ డేటా సెంటర్లు

దేశంలో పర్యావరణహిత AI డేటా సెంటర్ల నిర్మాణానికి 100 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035లోగా నేరుగా $100బిలియన్లు, సంబంధిత రంగాల కోసం మరో $150 బిలియన్లు వెచ్చించనుంది. సర్వర్ మాన్యుఫ్యాక్చరింగ్, సావరిన్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్, సెమీకండక్టర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ పెట్టుబడుల ద్వారా పదేళ్లలో $250 బిలియన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కాబోతోంది.
News February 17, 2026
సీతానగరం: అమాంతం పడిపోయిన టమోటా ధర!

టమోటా ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులు కిందట వరకు కిలో రూ.50 వరకు పలికిన ధర.. ప్రస్తుతం రూ.6 నుంచి రూ.8 పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీతానగరం మండలం చినబోగిలి కూడలికి రైతులు సరుకు తెచ్చి అమ్ముతున్నారు. 25 కేజీలు ఉన్న కేటు రూ.200 నుండి రూ.250కు వ్యాపారస్తులు కొంటున్నారని, పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
News February 17, 2026
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత సెల్ ఫోన్ శిక్షణ

సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(RSETI) ఉచితంగా సెల్ ఫోన్ సర్వీసింగ్ శిక్షణ ఇస్తోంది. 19 నుంచి 45 ఏళ్ల వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను 94901 03390, 94901 29839 నంబర్లకు వాట్సాప్ చేయాలని డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


