News March 17, 2025
రాజీవ్ యువ వికాసం పథకం సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క

రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కావున ములుగు జిల్లాలోని యువతి, యువకులు అందరూ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దీనికి స్థానిక పార్టీ శ్రేణులు తమ తమ గ్రామాల్లో ఉన్న యువతీ యువకులకు తెలియచేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
Similar News
News April 21, 2025
జంబ్లింగ్ విధానంలో ఏయూ డిగ్రీ పరీక్షల నిర్వహణ

ఏయూ పరిధిలో డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 180 కాలేజీల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఉ.9 నుంచి 12 వరకు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
News April 21, 2025
వడ్డీతో సహా చెల్లిస్తాం: మేకపాటి

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని వైసీపీ ఉదయగిరి ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
News April 21, 2025
ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.