News January 29, 2025
రాజోలు: వెండి, బంగారు పతకాలు అందుకున్న ఫొటోలు

సఖినేటిపల్లి మండలంలో ది ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాప్‌లో అద్భుతమైన చిత్రాలు బహుమతులు అందుకున్నాయి. రాజోలు మండలం తాటిపాకకు చెందిన రవితేజ తీసిన ఆలయం వద్ద కూచిపూడి నృత్యం ఫొటో బంగారు పతకం సాధించింది. నగరం గ్రామానికి చెందిన మీర్ జవాద్ అలీ తీసిన పసుపు రంగు తెరచాప కలిగిన పడవపై మత్స్యకారుడు వల విసురుతున్న చిత్రం వెండి పతకం సాధించింది.
Similar News
News February 8, 2025
నర్సీపట్నంలో అల్లూరికి చెందిన ఫారెస్ట్ ఉద్యోగి మృతి

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడి పుట్టన్న అనే ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. నర్సీపట్నం కూడలిలో బైక్‌పై వెళ్తుండగా హ్యాండీల్ అటుగా వెళ్తున్న బస్సుకు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై టౌన్ సీఐ గోవిందరావు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ మర్రిపాకల రేంజ్‌లోని పలకజీడి సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు.
News February 8, 2025
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
News February 8, 2025
ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP

ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.