News November 8, 2025

రాజ్‌తో ఫొటో వైరల్.. సమంత రెండో పెళ్లిపై చర్చ!

image

సమంత నిన్న రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న <<18228781>>ఫొటోను<<>> షేర్ చేయడంతో పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ నుంచి సమంత, రాజ్ స్నేహం మొదలైంది. అప్పటినుంచి వీరిద్దరూ డేట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియా ఎప్పటినుంచో కోడై కూస్తోంది.

Similar News

News January 15, 2026

ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో నారావారిపల్లెలో ఉన్న ఆయన క్లస్టర్ యూనిట్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఆదాయం వచ్చేలా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఇంటర్నెట్, క్యాబిన్లు, క్యాంటిన్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు.

News January 15, 2026

ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

News January 15, 2026

173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.