News April 14, 2025
రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే కోరం

భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని టేకులపల్లి మండలం సులానగర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం వల్లే నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్ర్య సంక్షేమ ఫలాలు పొందుతున్నామన్నారు.
Similar News
News January 22, 2026
ENE2లో సుశాంత్ చేయట్లేదు: తరుణ్ భాస్కర్

ఈ నగరానికి ఏమైంది రిపీట్(ENE2)లో సాయి సుశాంత్(కార్తిక్) చేయట్లేదని వస్తున్న వార్తలను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫామ్ చేశారు. ‘పర్సనల్ రీజన్స్ దృష్ట్యా సుశాంత్ యాక్ట్ చేయట్లేదని తెలిసి బాధ పడ్డాను. సుశాంత్ లేకపోవచ్చు కానీ కార్తిక్ ఉంటాడు. అదే ప్రపంచాన్ని అవే క్యారెక్టర్స్‌ని మీ ముందుకు తీసుకొస్తాం. నా కాస్ట్, క్రూని నమ్ముతున్నాను. మీరు నాపై నమ్మకం ఉంచండి కుర్రాళ్లు ఇరగదీస్తారు’ అని తెలిపారు.
News January 22, 2026
AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో AIపై నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్‌పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్‌లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News January 22, 2026
మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.


